వైభవంగా చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం

68చూసినవారు
వైభవంగా చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం
ముత్తుకూరులోని కృష్ణపట్నం గ్రామపంచాయతీ పరిధిలోని కావలి దళితవాడలో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి వారి కళ్యాణం వైభవంగా జరిగింది. విశేష పుష్పాలంకరణతో వేదమంత్రాలు మధ్య స్వామి కళ్యాణం జరిపారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా కళ్యాణ మహోత్సవం పాల్గొని పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్