మనుబోలు: రోడ్డు ప్రమాదానికి గురైన మెడిసిన్ లారీ

59చూసినవారు
మనుబోలు: రోడ్డు ప్రమాదానికి గురైన మెడిసిన్ లారీ
నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద హైవేపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెడిసిన్ లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు అదుపుతప్పి పక్కనే ఖాళీ స్థలంలో పడిపోయింది. ఈ ఘటనలో లారీలో ఉన్న ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తెల్లవారుజామున పొగ మంచు ఎక్కువగా ఉండడం వలన డ్రైవర్ కు దారి కనిపించక ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్