సంక్రాంతి సందర్భంగా జలదంకి మండలం బ్రాహ్మణ క్రాక గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు వేడుకలలో ఉదయగిరి, కావలి ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ నిర్వహించిన మహిళలకు ముగ్గులు పోటీలు, పలు టోర్నమెంట్లు, అలాగే ఎద్దుల పోటీల విజేతలకు బహుమతులను ఎమ్మెల్యేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వంటేరు వేణుగోపాల్ రెడ్డి, కంభం విజయరామిరెడ్డి పాల్గొన్నారు.