ఉదయగిరి: విద్యుత్ సమస్యలపై మంత్రికి వినతి

58చూసినవారు
ఉదయగిరి: విద్యుత్ సమస్యలపై మంత్రికి వినతి
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను ఉదయగిరి శాసనసభ్యులు కాకుల సురేష్ ఆదివారం కలిశారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న విద్యుత్ సమస్యలను ఎమ్మెల్యేకు వినతిపత్రం రూపంలో అందజేశారు. ట్రాన్స్ ఫార్మర్ లు లేక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, అలాగే నియోజకవర్గంలో మూడు సబ్ స్టేషన్ల పరిధిలో దాదాపు 150 ట్రాన్స్ ఫార్మర్ ల కొరత ఉందని తెలిపారు. విద్యుత్ సిబ్బంది కొరత కూడా ఉందని విన్నవించారు.

సంబంధిత పోస్ట్