మిలిటెంట్ గ్రూపు హెజ్బొల్లాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ ఆదివారం (నవంబర్17) జరిపిన వైమానిక దాడిలో హెజ్బొల్లా ప్రధాన ప్రతినిధి మహమ్మద్ ఆసిఫ్ మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇటీవలి కాలంలో సెంట్రల్ బీరుట్‌పై ఇజ్రాయెల్ సేనలు దాడి చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మహమ్మద్ ఆసిఫ్ అనేక సంవత్సరాలుగా హెజ్బొల్లా మీడియా వ్యవహారాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు.