ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యల కారణంగా ఏ విద్యార్థికి హాల్ టిక్కెట్లు నిరాకరించడం, తరగతులకు లేదా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాకుండా నిరోధించడం చేయరాదని కలెక్టర్ వినోద్ కుమార్ ఒక ప్రకటనలో ఆదివారం తెలిపారు. అనంత జిల్లాలో ఏ డిగ్రీ, ఇంటర్మీడియట్ కళాశాలలలో అయినా విద్యార్థులకు హాల్ టిక్కెట్లు నిరాకరించడం, తరగతులకు, ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాకుండా నిరోధిస్తే సంబంధిత కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.