కడప 4వ జోన్ మలేరియా అధికారి డా. లక్ష్మానాయక్ బుధవారం అనంతపురం క్షేత్ర పర్యటనకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ. ఈ వర్షాకాల సీజన్ లో మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, వ్యాధుల నియంత్రణకు పరిసరాల పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, ముందస్తుగా చేపట్టవలసిన అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. దోమలతో వచ్చే జబ్బుల పట్ల సరైన అవగాహన ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు.