ధర్మవరం మున్సిపాలిటీలో బకాయి ఉన్న ఆస్తి పన్నులు, ఇతరత్రా పన్నుల వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ధర్మవరం మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ సూచించారు. గురువారం ధర్మవరం మున్సిపల్ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. ఆస్తి పన్నులు 13 కోట్లకు పైగా ఉందని నీటి ఛార్జీలు 8 కోట్లకు పైగా బకాయి ఉందని పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలన్నారు.