పామిడి భోగేశ్వరుడికి అమావాస్య పూజలు

55చూసినవారు
పామిడి భోగేశ్వరుడికి అమావాస్య పూజలు
పామిడి పట్టణంలోని ప్రసిద్ధ శివ క్షేత్రమైన శ్రీ భోగేశ్వర స్వామి శివాలయంలో బుధవారం అమావాస్య పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేకువ జామున ఆలయ అర్చకులు స్వామి వారి మూలమూర్తికి సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భోగేశ్వరుడి నామస్మరణతో ఆలయం మారుమోగింది.
Job Suitcase

Jobs near you