గుత్తి మున్సిపాలిటీలో మాంసం విక్రయాలు నిషేధం

74చూసినవారు
గుత్తి మున్సిపాలిటీలో మాంసం విక్రయాలు నిషేధం
గుత్తి మున్సిపాలిటీ పరిధిలో అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతిని పురస్కరించుకొని మాంసం విక్రయాలను నిషేధించామని మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ రెండో తేదీన మాంసం విక్రయదారులు ఎవరూ కూడా మాంసం విక్రయించకూడదన్నారు. మా ఆదేశాలు ధిక్కరిస్తే మున్సిపాలిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్