గుత్తి మండలం రజాపురం గ్రామ సమీపంలో గురువారం రాత్రి చంద్రశేఖర్ అనే యువకుడు కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రజాపురంలో బంధువుల ఇంటికి వచ్చాడు. పొలాల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు గుత్తి ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.