హిందూపురంలో నూతనంగా పట్టు గూళ్ళ మార్కెట్ భవనంను నిర్మించాలని పట్టు రైతులు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు వినతి అందించారు. శుక్రవారం పట్టు రైతులు మాట్లాడుతూ ఇతర జిల్లాల నుంచి పట్టు వస్తుందని ఇటీవల కాలంలో వర్షం కురిసిన ప్రతి సారి వర్షనీరు మార్కెట్లోకి చేరి రైతులకు నష్టం కలుగుతుందన్నారు. అదే విధంగా దాదాపుగా పట్టు రైతులకు రూ. 60 కోట్ల ఇన్సెంటీవ్ పెండింగ్లో లో ఉందని వాటిని అందేలా చేయాలని కోరారు.