కళ్యాణదుర్గం సబ్ జైలును తనిఖీ చేసిన జిల్లా సెక్రెటరీ

50చూసినవారు
కళ్యాణదుర్గం సబ్ జైలును తనిఖీ చేసిన జిల్లా సెక్రెటరీ
కళ్యాణదుర్గం పట్టణంలోని సబ్ జైలును గురువారం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ శివప్రసాద్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన జైల్లోని కిచెన్, స్టోర్ రూమ్, టాయిలెట్స్, బాత్రూమ్స్, ఖైదీలు ఉండే సెల్స్ పరిశీలించారు. భోజనాన్ని రుచి చూశారు. ఖైదీలతో మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరి చక్రవర్తి పాల్గొన్నారు.