ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ మిలిటెంట్ అధినేత యాహ్యా సిన్వర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైన్యం సిన్వర్‌కు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది. ఓ సొరంగ మార్గంలోకి సిన్వర్, అతడి భార్య వెళ్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. గతేడాది అక్టోబరు 7నాటి దాడులకు కొన్ని గంటల ముందు సిన్వర్ ఈ సొరంగంలోకి వెళ్లి దాక్కున్నట్లు ఇజ్రాయెల్ దళాలు పేర్కొన్నాయి. డీఎన్‌ఏ పరీక్ష ద్వారా మృతి చెందింది హమాస్ అధినేతేనని నిర్ధారించిన విషయం తెలిసిందే.