గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద ఏర్పాటైన నాసన్ , బెల్ భూ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజ్ చెల్లింపుల విషయం స్పష్టం చేసి అర్హుల జాబితా ప్రకటించాలని శుక్రవారం పెనుకొండ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూపదుల సార్లు అర్జీలు ఇచ్చిన అధికారులకు చలనం లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.