మండల కేంద్రమైన కొత్తచెరువులో బోయ శివకుమార్ 31 అనే వ్యక్తి కడుపు నొప్పి తాళలేక సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇతను బేల్దారి పని చేసుకుంటూ జీవనం చేస్తూ ఉండేవాడు. బుధవారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటిలోని సీలింగ్ ఫ్యాన్ కుచీరతో ఉరి వేసుకుని చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. అతని భార్య పుష్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.