
గౌనిపల్లిలో ఇంటి ఇంటికి 104 సేవలు
ఓడి చెరువు మండలం అల్లాపల్లి గ్రామపంచాయతీ పరిధి గౌనిపల్లి గ్రామంలో ఇంటింటికి 104 సేవలు వైద్యాధికారి కమల్ రోహిత్ ఆద్వరంలో శుక్రవారం నిర్వహించారు. వచ్చిన రోగులకు, వ్యాధిగ్రస్తులకు వ్యాధులు పట్ల అవగాహన కార్యక్రమము, సలహాలు, సూచనలు తెలియజేసిన అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య సేవలు బీపీ, షుగర్, ఆస్తమా, థైరాయిడ్, చిన్నపిల్లలకు రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు.