రాయదుర్గం: 20కేజీల వెన్న అలంకరణలో మురడి ఆంజనేయుడు

76చూసినవారు
డి. హీరేహల్ మండలం మురిడి గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ ఆంజనేయుడికి కార్తీక మాసం సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి వేకువజామునే పురోహితులు పవన్ పంచామృత కుంకుమార్చనలు చేపట్టి స్వామి మూలవిరాటు 20 కేజీల వెన్నతో అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. స్వామి వారి విశేష అలంకరణను భక్తులు దర్శించుకుని ప్రత్యేక తన్మయత్వం పొందారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్