తాడిపత్రి నగర ఆధునీకరణ అభివృద్ధిపై మున్సిపల్ చైర్మన్ జె. సి ప్రభాకర్ రెడ్డి దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆయన మున్సిపల్ స్థలాల్లో అక్రమ లే అవుట్లపై చర్చించి తగు చర్యలు చేపట్టేందుకు ఆయన నడుం బిగించారు. ఈ నెల 7వతేదీన జరిగే సమావేశానికి పట్టణంలోని రియల్ ఎస్టేటర్లు, లైసెన్స్ సర్వేయర్లు, స్టాంపు రైటర్లు, పట్టణ ప్రముఖులు హాజరు కావాలని జె. సి ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో శుక్రవారం పేర్కొ న్నారు.