తాడిపత్రి: ఎన్. హెచ్ 544డి పనులను వేగవంతం చేయాలి

62చూసినవారు
తాడిపత్రి: ఎన్. హెచ్ 544డి పనులను వేగవంతం చేయాలి
జిల్లాలో ఎన్. హెచ్544డి పనులను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలోని తాడిపత్రి మండలంలోని ఆలూరు గ్రామం వద్ద, పుట్లూరు మండలం కొండాపురం గ్రామం వద్ద, నార్పల మండలం వెంకటంపల్లి వద్ద, సింగనమల మండలం నాయనపల్లి మరియు చక్రాయపేట గ్రామాల వద్ద, రహదారికి భూసేకరణకు వెళుతున్న గ్రామాల పరిధిలో చేపడుతున్న ఎన్. హెచ్ 544డి పనులను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు.