తాడిపత్రి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్ కో ఏఈ వీరాంజనేయులు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని అంబేడ్కర్ నగర్, యల్లనూరు రోడ్డు, చింతల వెంకటరమణస్వామి ఆలయం ప్రాంతాల్లో ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని వారు చెప్పారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.