అహుడా ఛైర్మన్ నియమితులైన జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ ను తాడిపత్రి ఇన్ ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురంలోని టీసీ వరుణ్ నివాసంలో తాడిపత్రి జనసేన నాయకులతో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతపురం జిల్లాలో మొదటి నామినేటెడ్ పదవికి జనసేన అధ్యక్షుడు ఎంపికవడం సంతోషంగా ఉందని అన్నారు.