వజ్రకరూరు మండలం తట్రకల్లు గ్రామంలో వెలసిన శ్రీభద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరభద్రుడికి రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన ప్రత్యేక అలంకారం చేశారు. అనంతరం స్వామివారికి అమ్మవారికి మహామంగళ హారతి తరువాత తీర్థ ప్రసాదాలు భక్తులకు ఆలయ పూజరులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజరులు భక్తులు పాల్గొన్నారు.