ఆముదాలవలస నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో గల భవిత పాఠశాలలో గురువారం జాతీయ బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నేటి బాలలే రేపటి పౌరులుగా మరి భావి భారతాన్ని దృఢంగా నిర్మించాలని ఎన్నారై ఎస్.శ్రీనివాసరావు అన్నారు. విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించే బహుమతులు ఇచ్చామని కరస్పాండెంట్ ఎస్.మురళీ, డైరెక్టర్ ఎస్ సునీత పాల్గొన్నారు.