హనుమాన్ జయంతి సందర్భంగా 5వేల మందికి అన్నప్రసాద్ వితరణ

60చూసినవారు
ఆముదాలవలస మండల కేంద్రంలో గల అయ్యప్పస్వామి ఆలయంలో ఉన్న భక్తాంజనేయ ఆలయప్రాంగణం వద్ద హనుమాన్ జయంతి సందర్భంగా సుమారు 5000 మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. భక్తులకు ఎటువంటిఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీసభ్యులు తమ్మినేని గీతా విద్యాసాగర్, భక్తులు నూక లక్ష్మణరావు ఏర్పాట్లు చేశారు. పరిసర గ్రామ భక్తులు స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు కార్యక్రమంలో మల్లికార్జున్ సురేషు పాల్గొన్నారు.