ప్రభుత్వం ఎస్ ఈ బి పేరును ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ గా మార్పు చేయడం హర్షనీయమని ఆమదాలవలస ఎక్సైజ్ ఎస్సై రాజారావు అన్నారు. ఈ మేరకు శనివారం ఆమదాలవలస ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ వద్ద ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కి కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అలాగే ఆముదాలవలస ఎస్ ఈ బి స్టేషన్ బోర్డును ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ గా మార్చామని అన్నారు.