ఎచ్చెర్ల: విద్యార్థులు మాదకద్రవ్యాల జోలికి వెళ్లకండి

67చూసినవారు
మాదకద్రవ్యాల (డ్రగ్స్) అలవాటుతో జీవితాలు నాశనం అవుతాయని లావేరు ఎస్సై లక్ష్మణరావు పేర్కొన్నారు. మండలంలోని తామాడ ఆదర్శ పాఠశాలలో గురువారం డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యువత మంచి ప్రవర్తనతో మెలగాలని, కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. చెడు వ్యసనాల జోలికి పోమని విద్యార్థుల చేత సంకల్ప దీక్ష ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ డానీయల్, ఉన్నారు.