లావేరు మండల కేంద్రంలోని స్థానిక శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు విజయనగరం కూటమి ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమంలో కలిశెట్టి పాల్గొని, భక్తులకు తీర్థ ప్రసాదాలు వడ్డించారు