ఎచ్చెర్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ మొదలవలస చిరంజీవి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. సభ ఎజెండాను ఎంపీడీవో ఎస్. హరిహరరావు సభ్యులకు చదివి వినిపించారు. అన్ని శాఖలకు సంబంధించి అంశాలపై చర్చ నిర్వహించగా. సభ్యుల ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇచ్చారు. కొన్ని గ్రామాలకే పనులు కేటాయించకపోవడంపై కొందరు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.