బెంగుళూరులో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న 14 నెలల పసిపాపకు.. నారాయణ ఆసుపత్రి వైద్యులు గుండెమార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ మేరకు గురువారం నారాయణ వైద్య నిపుణులు శశిరాజ్ బృందం ఆపరేషన్ వివరాలను మీడియాకు తెలిపారు. అయితే ఈ ఆపరేషన్ ఆగస్టు 18న జరిగిందని, ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యంగా ఉందని వెల్లడించారు.