కస్టమర్లను తన వైపు తిప్పుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ మరో కొత్త సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్రిస్మన్ నేపథ్యంలో ఏటా అమెరికాలో జరుపుకొనే బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ఈ సారి భారత్‌లోనూ ప్రవేశపెట్టనుంది. యూఎస్ఏలో ప్రతి సంవత్సరం నవంబర్ చివరి శుక్రవారం ఈ సేల్‌ను నిర్వహిస్తారు. ఈ ఏడాది నవంబర్ 29న బ్లాక్ ఫ్రైడే వస్తుంది. ఈ నేపథ్యంలో భారత్‌లో నవంబర్ 24 నుంచి 29 వరకు భారీ ఆఫర్లతో బ్లాక్ ఫ్రైడే సేల్స్ నిర్వహించనుంది.