ఈ నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో గ్రామాలలో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని పోలాకి ఎస్సై వి సత్యనారాయణ తెలిపారు. పోలాకి మండలం రాళ్లపాడు పంచాయతీలో శుక్రవారం రాత్రి స్థానిక గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాలలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎటువంటి సంఘటన జరిగిన తమ దృష్టికి తీసుకుని రావాలని ఆయన కోరారు.