Apr 29, 2025, 14:04 IST/ముథోల్
ముథోల్
బాసర: 21వ రోజు బతుకమ్మ ఆడుతూ నిరసన
Apr 29, 2025, 14:04 IST
బాసర అర్జీయూకేటిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమను క్రమబద్ధీకరించాలంటూ చేపట్టిన నిరవధిక సమ్మె 21వ రోజుకు చేరుకుంది. నిరసనలో భాగంగా మంగళవారం బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. తమకు రెగ్యులరైజ్ చేయాలని బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. సీఎం రేవంత్ త్వరగా స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామన్నారు.