నవధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించండి

55చూసినవారు
నవధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించండి
సారవకోట మండలంలోని చీడిపూడి రైతు భరోసా కేంద్రంలో గురువారం ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనీ రమణ నవ ధాన్యాల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. వచ్చే ఖరీఫ్ సీజన్ తొలకరి వర్షాలకు ముందు నవ ధాన్యాలు సాగు చేయాలన్నారు. దీంట్లో ఎకరానికి 12 కేజీల విత్తనాలు చల్లుకోవాలని, తద్వారా నేల సారవంతం, తేమగా ఉంటుందన్నారు. దీని వల్ల నేలలో ఉండే సూక్ష్మజీవులు సమృద్ధిగా అభివృద్ధి చెందుతాయి అన్నారు.

సంబంధిత పోస్ట్