పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఎన్డీఏ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పరిచారు. ఈ సందర్భంగా పలాస ఎమ్మెల్యే సమావేశంలో పాల్గొన్నారు. సభ అనంతరం నారా లోకేష్ ఆమెకు ఎమ్మెల్యేగా విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు.