పలాస: ఇలా చేసి విషాదం నింపుకోవద్దు
నూతన సంవత్సర వేడుకలలో మద్యం సేవించి డ్రైవింగ్ చేసి జీవితాలలో విషాదం నింపుకోవద్దు అంటూ యూనివర్సల్ సీమాన్ ట్రైనింగ్ సెంటర్ వినూత్న ప్రచారం చేశారు. ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకులు తిర్రి. ప్రసాద్, అంబటి ప్రవీణ్ ఆధ్వర్యంలో మంగళవారం పలాస మున్సిపాలిటీలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ స్లోగన్ ప్రస్తుతం పలాసలో హాట్ టాపిక్ గా మారింది. కార్యక్రమానికి సహకరించిన కాశీబుగ్గ పోలీసులకు వారు ధన్యవాదాలు తెలిపారు.