పలాసలో వర్షం

64చూసినవారు
పలాస నియోజకవర్గంలో రోజుకో వాతావరణంతో ప్రజలకు బెంబేలెత్తిస్తుంది. ఎండాకాలంలో ఉండే వేడి గత కొన్ని రోజులుగా ఉంటూ, మధ్య మధ్యలో చిన్న చిన్న వర్షాలు మాత్రమే పడుతున్నాయి. ఫిబ్రవరి నెల నుండి ఈ ప్రాంతంలో తాగడానికి నీరు లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ చిన్న వర్షాలతో నీటి ఎద్దడి తీరే ప్రసక్తే లేకపోవడంతో పెద్ద వర్షాలు ఎప్పుడు పడతాయో అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్