పాతపట్నం మండలం సవర తిడ్డిమి గ్రామంలో బుధవారం పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించారు. సర్పంచ్ ప్రతినిధి టీ. ప్రవీణ్ ఆధ్వర్యంలో గ్రామం లోని కాలువల్లో పూడికలు తీసి శుభ్రం చేశారు. క్లోరినేషన్ తోపాటు పరిసరాలు శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ జి. వనజాక్షి, పంచాయతీ కార్యదర్శి ఎన్ పాపారావు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.