శ్రీ నీలమణి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

60చూసినవారు
పాతపట్నం మండల కేంద్రంలోని కొలువై ఉన్న శ్రీ నీలమణి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో గురువారం స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సతీసమేతంగా ఆలయానికి చేరుకుని హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సాగర స్వాగతం పలికారు. అనంతరం నేరుగా అమ్మవారి కి పట్టు వస్త్రాలను ఆయన సమర్పించారు. ఈ ఉత్సవాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్