అజాధికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగ జెండా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా జిల్లా అధికారులు ఘనంగా నిర్వహించారు. గురువారం ఐసిడిఎస్ కార్యాలయం నుంచి 80 అడుగుల రోడ్డు మీదగా ఆర్అండ్బి బంగ్లా నుంచి డచ్ బంగ్లా వరకు భారీ ఎత్తున స్వయం సహాయక సంఘాల సభ్యులతో కలిసి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.