ఎరువుల బస్తాలు దాచిపెడితే సంబంధిత డీలర్ల అనుమతులు రద్దు చేస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖరీప్ 61, 262 టన్నుల ఎరువుల పంపిణీ లక్ష్యం కాగా ఇప్పటివరకు 65, 007 టన్నులు సరఫరా చేశామని తెలిపారు. జిల్లా, డివిజన్, మండల అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు.