RBI గవర్నర్ శక్తికాంతదాస్ పదవీకాలం డిసెంబర్ 10తో ముగియనుంది. అయితే శక్తికాంతదాస్ పదవీకాలన్ని కేంద్రప్రభుత్వం పొడిగించనుందని పేర్కొంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇదే జరిగితే 1960 తర్వాత అత్యధిక కాలం RBI గవర్నర్గా పనిచేసిన అధికారిగా శక్తికాంతదాస్ ప్రత్యేక గుర్తింపు పొందనున్నారు. 2018లో RBI గవర్నర్గా శక్తికాంతదాస్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.