బూరగాంలో పోలీసులకు పట్టుబడిన 50 మద్యం బాటిళ్లు

613చూసినవారు
బూరగాంలో పోలీసులకు పట్టుబడిన 50 మద్యం బాటిళ్లు
టెక్కలి మండలం బూరగాం గ్రామానికి చెందిన పట్నాన వెంకటరమణ వద్ద అక్రమంగా ఉన్న 50 మద్యం సీసాలను శుక్రవారం స్వాధీనం చేసుకున్నట్లు టెక్కలి సెబ్ సీఐ రాజశేఖర్ నాయుడు తెలిపారు. గ్రామంలో తనిఖీలు నిర్వహించిన సమయంలో 180 మి. లీ మద్యం సీసాలు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమంగా మద్యం నిల్వలు కలిగి ఉంటే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్