లావేరు మండలం కొత్త కుంకం యూనిట్ కొత్త కుంకాం గ్రామంలో ఆదివారం మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణ కోసం విష ముసిడి కషాయం 3 గురు రైతులతో తయారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా లావేరు మండల ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రాంబాబు, అప్పారావు , సోమశేఖర్ మాట్లాడుతూ ఒక ఎకరా మొక్కజొన్న పంటకి కావాల్సిన పదార్థాలు మరియు తయారుచేసే విధానం గురించి రైతులకు ఎలా పిచికారి చేయాలో వివరించారు.