జులై 2024లో వచ్చిన అకాల వర్షాలు, కొన్నిచోట్ల వరదల కారణంగా పలుచోట్ల రహదారులకు గుంతలు ఏర్పడి మరమ్మతులకు గురైన విషయం తెలిసిందే. ఇటువంటి రోడ్లు శాశ్వత మరమ్మతులకు ఆముదాలవలస నియోజకవర్గానికి ప్రభుత్వం నుంచి రూ. 2. 93 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే కూన రవికుమార్ ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడుకు, రహదారులు భవనాల శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.