స్వతంత్ర అభ్యర్థి ఎన్నికల ప్రచారం
బూర్జ మండలం తోటవాడ గ్రామంలో ఆముదాలవలస నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సువ్వారి గాంధీ తరపున ఆయన సోదరుడు సువ్వారి ఢిల్లీరావు ఆయన మద్దతుదారులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దశాబ్దాలుగా ఆముదాలవలస నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోవడం లేదని, కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలకాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి సువ్వారి గాంధీని గెలిపించుకోవాలన్నారు.