Sep 17, 2024, 02:09 IST/
సీఎం మమతా-డాక్టర్ల సమావేశం తర్వాత కోల్కతా పోలీస్ కమిషనర్, ఇద్దరు ఆరోగ్య అధికారుల తొలగింపు
Sep 17, 2024, 02:09 IST
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME), డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DHS) అధికారులతో పాటు, కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ లను వారి పోస్టు నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్లతో సమావేశం అనంతరం వారి డిమాండ్ల పరిష్కారంలో బాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.