పార్లమెంట్‌ సమీపంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వ్యక్తి

64చూసినవారు
పార్లమెంట్‌ సమీపంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వ్యక్తి
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఒక షాకింగ్ సంఘటన జరిగింది. పార్లమెంట్‌ సమీపంలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని తనకు తాను నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన అక్కడి స్థానికంగా సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని వెంటనే RML ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్