AP: తిరుపతి పట్టణంలో ఉన్న అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాజ్ టోపీ పెట్టిన వార్త సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సీసీటీవీ ఫుటేజీని పోలీసులు చెక్ చేయగా.. ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ ఓ వ్యక్తి పెట్టినట్లు గుర్తించారు. ఆ వ్యక్తి స్థానిక జంక్షన్‌లో పెన్నులు అమ్ముతుంటాడని సమాచారం. అతడిని అదుపులోకి తీసుకొని చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.