డిజిటల్ పేమెంట్లు చేసేటప్పుడు QR కోడ్ స్కాన్ చేసి, పేమెంట్స్ చేస్తూ ఉంటాం. అయితే ఇలా పేమెంట్స్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. QR కోడ్ స్కాన్ చేశాక స్క్రీన్‌పై కనిపించే వివరాలను ఒకసారి సరిచూసుకోవాలి. ఏమైనా తప్పులు ఉంటే వెంటనే వ్యాపారిని అడిగి తెలుసుకోవాలి. అలాగే QR కోడ్ స్కాన్ చేయడానికి APK లింక్లను పంపే అపరిచితుల నుంచి వచ్చే సందేశాలపై జాగ్రత్తగా ఉండండి. ఇంకా QR స్కాన్ చేయడం కంటే వీలైతే UPI ID ద్వారా చెల్లింపులు చేయడం మంచిది.